![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -328 లో.....సుధా విశ్వల కూతురు గంగ అని లక్ష్మి పైడిరాజు శాశ్వతంగా ఎవరికి చెప్పకుండా జయ ప్లాన్ చేస్తుంది. కావాలనే గొడవ పెట్టుకుంటుంది. ఈ గంగనే మీ కూతురు అని అబద్ధం చెప్పి ఆస్తులు కొట్టేయాలని చూస్తున్నారని లక్ష్మీ, పైడిరాజు గురించి విశ్వతో చెప్తుంది. వాళ్ళు ఎప్పటికి అలా చెయ్యరు.
ఒకవేళ గంగ నిజంగా మా కూతురు అయినా వాళ్ళు వచ్చిన మొదటి రోజే చెప్పేవాళ్ళు మోసం చెయ్యరు.. మంచి మనుషులు అని విశ్వ అంటాడు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకు అని జయకి విశ్వ వార్నింగ్ ఇస్తాడు. ఇది ఎప్పటికి నిజం చెప్పిన నమ్మకుండా చేసిందని లక్ష్మీ అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్ ని పెద్దసారు కలిసి మాట్లాడుతాడు. నీతో రోజు కలిసి మాట్లాడాలని ఉందని పెద్దసారు అనగానే రోజు రండి సర్ అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ప్రమీల పెద్దసారు ఇంటికి వెళ్తు దారిలో ఫ్రూట్స్ కొందామని ఆగుతారు.
అక్కడ కొంతమంది ఆకతాయిలు ప్రమీలని ఏడిపిస్తారు. అది పెద్దసారు చూసి వాళ్లతో కోపంగా మాట్లాడుతాడు. దాంతో పెద్దసారు పై వాళ్ళు చెయ్ చేసుకుంటారు. తన షర్ట్ పై మట్టి తో ఉన్న తమ చేతుల మరకలు అంటిస్తారు. ఆ తర్వాత పెద్దసారు ప్రమీల ఇంటికి వెళ్తారు. పెద్దసారు షర్ట్ కి ఉన్న మరకలు చూసి ఏమైందని శకుంతల అడుగుతుంది. ప్రమీల జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |